8 May, 2026 | 3:33 AM

ఆర్‌సీబీకి షాక్

08-05-2026 01:36 AM

మార్ష్ సెంచరీ 

పూరన్, పంత్ మెరుపులు 

ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి షాక్ తగిలింది. ఊహించని విధంగా లక్నో సూపర్ జెయింట్స్ సంచలన విజయం సాధించింది. లక్నో ఓపెనర్ మిఛెల్ మార్ష్ సెంచరీతో చెలరేగిన వేళ, బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో బెంగళూరుకు ఓట మి తప్పలేదు. 

లక్నో, మే 7: ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి న లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు మిఛెల్ మార్ష్, కులకర్ణి మెరుపు ఆరంభాన్నిచ్చారు. మార్ష్ విధ్వంకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. తొలి వికెట్ కు 9.2 ఓవర్లలోనే 95 పరుగులు జోడించాడు. కులకర్ణి (17) పరుగులకు ఔటవగా... మార్ష్‌కు పూరన్ జతకలిసాడు.

వీరిద్దరూ ఆర్సీబీ బౌలర్లపై వి రుచుకుపడ్డారు. మధ్య మధ్య లో వరుణుడు అడ్డుపడుతూ చికాకు పెట్టినా మార్ష్ , పూరన్ అదరగొట్టారు. భారీ షాట్లతో చెలరేగిన వీరి జోడీ రెండో వికెట్‌కు 41 బంతుల్లోనే 70 పరుగులు జోడించిం ది. ఈ క్రమంలో మార్ష్ సెం చరీ పూర్తి చేసుకున్నాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించిన మార్ష్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు ఉ న్నాయి.

మార్ష్ 56 బంతుల్లో 111 పరుగులు చేసి వెనుదిరిగాడు. నికోలస్ పూరన్ 23 బంతుల్లో 38, పంత్ 10 బంతుల్లోనే 32 పరుగులు చేశారు. దీంతో లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఆర్బీబీ బౌలర్ల లో హ్యాజిల్ వుడ్, సలామ్ దార్, కృనాల్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.ఛేజింగ్‌లో ఆర్‌సీబీకి ఆరంభంలోనే షాక్ తగి లింది. బెథెల్ (4), కోహ్లీ డకౌటయ్యారు. ఈ దశలో రజత్ పటిదార్, పడిక్కల్ ఆదు కున్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోర్ పెంచారు. మూ డో వికెట్‌కు వీరి జోడీ కేవలం 53 బంతుల్లో 95 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పింది.

ఈ క్రమంలో పటిదార్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పడిక్కల్ 34 పరుగులకు ఔటైనా పటిదార్ దూకుడు కొనసాగింది. అయితే పటిదార్ 31 బంతుల్లో 61 (3 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక సమయంలో వెనుదిరిగాడు. కాసేపటికే జితేశ్ శర్మ(1) కూడా ఔటయ్యాడు. అయితే చివర్లో టిమ్ డేవిడ్, కృనాల్ పాం డ్యా దూకుడుగా ఆడడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 40 రన్స్‌కు ఔటవగా.. తర్వాత రూథర్ ఫర్డ్, కృనాల్ పోరాడినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది.

స్కోర్ బోర్డు

లక్నో ఇన్నింగ్స్ : 209/3 ( మార్ష్ 111, పూరన్ 38, పంత్ 32 నాటౌట్, హ్యాజిల్‌వుడ్ 1/49, కృనాల్ 1/31, రసిక్ సలామ్ దార్  1/53)

బెంగళూరు ఇన్నింగ్స్ : 203/6 ( పటిదార్ 61, టిమ్ డేవిడ్ 40, పడిక్కల్ 38 ; ప్రిన్స్ యాదవ్ 3/33, షాబాజ్ అహ్మద్ 2/33 )