calender_icon.png 5 February, 2026 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ గళమెత్తిన బలూచిస్తాన్!

05-02-2026 12:08:37 AM

డాక్టర్ కావలి చెన్నయ్య :

ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా -మార్చి 27, 1948న బలూచిస్తాన్‌ను పాకిస్థాన్ తమలో విలీనం చేసుకుంది. అప్పటి నుంచి తాము పాకిస్థాన్ నుంచి వేరు పడాలనే కాంక్షతో బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా  పోరాటం కొనసాగిస్తూనే ఉన్నా రు. కానీ బలూచిస్తాన్ ఎప్పటికీ తమదేనంటూ పేర్కొన్న పాకిస్థాన్ బలూచ్ ప్రావిన్స్‌పై అమానుష దాడులను మాత్రం ఆపడం లేదు. అయితే గతేడాది భారత్‌లో ప హల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట పాకిస్తాన్‌పై దాడి చేసి వారి వాయు సేనను తీవ్రంగా దెబ్బతీసింది.

ఇదే అదునుగా భావించిన బలూచ్ పోరాటయోధుడు మీర్ యార్ బలూచ్  2025, మే నెలలో ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ను ప్రకటించాడు. పాక్ సైన్యం తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని, తమ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి సహా ఇతర దేశాల ను వేడుకోవడం ఆలోచింపజేసింది.

అయి తే పాక్ మాత్రం బలూచిస్తాన్‌లో మానవ హక్కులను మంటగలిపి, ప్రజలపై మారణకాండను కొనసాగిస్తూ, వనరులను దోచుకుంటూ వస్తోంది.  కటిక పేదరికానికి తోడు పాక్ అణిచివేతకు ప్రతిగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) లాంటి సాయుధ గ్రూపుల ఏర్పడడంతో వారి  పోరాటం కొనసాగుతూనే ఉంది.

జిత్తులమారి జిన్నా..

చారిత్రకంగా పరిశీలించి చూస్తే ఒకప్పుడు బలూచిస్తాన్‌లో బ్రాహుయ్ ప్రజ లు ఉండేవారు. వీరికి భారత్‌లోని ద్రావిడ భాష మాట్లాడే ప్రజలతో దగ్గర సంబం ధం ఉండేది. వీరు హిందూ బౌద్ధ మతాలను స్వీకరించినట్టు తెలుస్తుంది. ఈ ప్రాం తాన్ని 7వ శతాబ్దం వరకు హిందూ రాజు లే పరిపాలించారని చరిత్ర పేర్కొంటుంది. 7వ శతాబ్దంలో అరబ్బుల దండయాత్రతో హిందువులు భయపడి బలవంతంగా ఇస్లాంలోకి మారిపోయారని సమాచారం.

అయితే ఇక్కడి హింగోల్ నదీ తీరంలో ఒక కొండ గుహలో వెలసిన హింగ్లాజ్ మాత హిందూ ధర్మంలోని 51 శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్నది. 1947 ఆగస్టు 15న భారత్, పాకిస్థాన్‌లు విడిపోయాయి. నాడు బ్రిటీష్ అధీనంలో భారత ఉపఖండంలో భాగంగా ఉన్న ‘ఖాన్ ఆఫ్ ఖలాత్/ నేటి బలూచిస్తాన్ స్వతంత్రంగానే ఉండిపోయింది. అయితే జిత్తులమారి మహమ్మద్ అలీ జిన్నా మాటలు నమ్మిన కొందరు బలూచ్ జమీందారులు, నాయకులు మత ఐక్యత పేరిట మోసపోయారు.

ఆ తర్వాత బలూచిస్తాన్‌ను పాక్ బలవంతంగా తమ లో విలీనమయ్యింది. విలీన సమయంలో పాకిస్తాన్ నావికాదళం అరేబియా సము ద్రం గుండా బలూచ్ వైపు వస్తున్నప్పుడు అక్కడి ప్రజలు తమకు ఏదో మంచి జరుగుతుందని ఆశించి సముద్రపు నీళ్లలోకి దిగి చేతులు పైకెత్తి స్వాగతం పలికారు. కా నీ ఆనాడు వారు చేసిన ఆ తప్పుకు ఇప్పటికీ ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తూనే ఉన్నా రు. నిజానికి నాడు చాలా మంది బలూచ్ ప్రజలు భారత్‌లో కలవాలని కోరుకున్నా రు. కానీ అప్పుడున్న రాజకీయ సమీకరణలు, ఇతర బౌగోళిక సమస్యల దృష్ట్యా మన దేశ పాలకులు సరిగ్గా ప్రతిస్పందించలేదు. 

ఒప్పందం తుంగలోకి..

ఇక బలూచిస్తాన్ పాకిస్తాన్‌కు నైరుతి ప్రాంతంలో 3,47,190 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విశాల పీఠభూమితో అతిపెద్ద ప్రావిన్స్‌గా ఉంది. బలూచ్ ప్రజలకు లిపి కాని, భాష కాని లేకపోవడంతో సయ్యద్ జహుర్షా హష్మీ అనే రచయిత పర్షియన్ అరబిక్ (నస్తాలిక్) లిపిని సవరించి బలూ లిపిని తయారు చేశారు. అం దుకే జహుర్షాను బలూచ్ పితామహుడిగా అభివర్ణిస్తారు. 1817--1839 వరకు బలూచిస్తాన్‌ను మీర్ మెహ్రబ్ ఖాన్ ఆహమ్మద్ జాయ్ పాలించాడు.

అఫ్గానిస్తాన్‌పై బ్రిటీష్ వాళ్లు చేసిన దాడికి మద్దతు ఇవ్వనందున బలూచిస్తాన్ పై బ్రిటీష్‌లు దాడి చేసి మెహ్రబ్ ఖాన్ చంపేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మొత్తం తమ అధీనంలోకి తీసుకోవడంతో 1920 ల్లోనే బలూచ్ ప్రజల్లో బ్రిటీష్ వారిపై అసంతృప్తి పెరిగిపోయింది. దీని  ఫలితంగా 1929లో ‘అంజుమన్--ఎ--ఇత్తేహ ద్- బలుచిస్తాన్’ సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థ బలూచిస్తాన్ సంస్కృతిని రక్షించడం, స్వాతంత్య్రం కోసం పనిచేయడం మొదలుపెట్టింది.

బలూచ్ స్వాతంత్య్రానికి జిన్నా మద్దతు ఇవ్వడంతో పాటు.. ఆగస్టు 11, 1947న మీర్ అహ్మద్ యార్ ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాన్‌ను తమలో విలీనం చేసుకోవడమే గాక, మీర్ అహ్మద్ యార్‌ను కరాచీకి తీసుకెళ్లి బెదిరించి మరి విలీన ఒప్పందంపై సంతకం చేయించుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ అప్పటి ప్రిన్స్ అబ్లుల్ కరీమ్ గెరిల్లా దాడులతో తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశాడు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అతన్ని బలవంతంగా జైళ్లో నిర్భందించింది. 

తిరుగుబాట్లు..

ఆ తర్వాత బలూచిస్థాన్‌లో వివిధ వర్గాలు, సంస్థలు కలిపి బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్  (బీఎల్‌ఎఫ్) ఏర్పడింది. వీరి ఆధ్వర్యంలో 1963--69 మద్య గ్యాస్, సహజ వనరుల విషయంలో సమాన వాటా , పాక్ జైళ్లలోని బలూచ్ ఖైదీలను విడుదల చేయాలని, వన్ యూనిట్ రద్దు తదితర డిమాండ్లతో షేర్ మహమ్మద్ బిజ్రాని అధ్యక్షతన ‘పరారీ’ గెరిల్లా యుద్ధ సంస్థ పాక్ సైన్యంపై దాడులు చేసింది. అయితే 1969లో పాక్ సైన్యంతో బీఎల్‌ఎఫ్ కాల్పుల విరమణ ఒప్పందం కుదు ర్చుకున్నది.

వన్ యూనిట్ విధానాన్ని అన్ని ప్రావిన్సులు వ్యతిరేకించాయి. తమ సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు కాల గర్భంలో కలిసిపోతాయనడంతో 1970లో ఈ విధానాన్ని రద్దు చేశారు. అయితే పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో, బలూచిస్తాన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో, బలూచ్ నాయకులు ఖైర్ భక్ష్ మర్రి, అతావుల్లా మెంగల్ సారథ్యంలో ఇరాక్ నుంచి ఆయుధాలు సమకూర్చుకొని 1973--77 మధ్యలో పాక్‌పై మరో సారి తిరుగుబాటు చేసింది.

ఈ తిరుగుబాటులో 7 నుంచి 10 వేల మంది బలూ చీలు, అటు పాక్ నుంచి 3 నుంచి 5వేల మంది సైనికులు మరణించారు. బలూచ్‌ల తిరుగుబాటును అణిచివేసేందుకు పాక్ నుంచి 80 వేల మంది సైనికులు పాల్గొన్నారంటే ఎంత పెద్ద తిరుగుబాటోఅర్థమవుతుంది. ఆ తర్వాత పాక్ సైన్యాధిపతి జియా ఉల్ హక్.. ప్రధాని జుల్ఫికర్ అలీని సైనిక తిరుగుబాటు ద్వారా దించేసి అధికారంలోకి రావడంతో బలూచ్‌ల తిరుగుబాటు సమిసిపోయింది.

స్వాతంత్య్ర కాంక్ష!

అయితే ఖైబర్ భక్షి మర్రి కుమారుడైన మీర్ బలూ మర్రి ఆధ్వర్యంలో 2000 సం వత్సరంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ( బిఎల్‌ఏ) ఏర్పాటయింది. 2006లో జరిగిన నవాబ్ అక్బర్ బుగ్తి హత్యకు ప్రతీ కారంగా బీఎల్‌ఏ తిరుగుబాటుకు పిలుపునివ్వగా, బలూచ్‌ల అణచివేతకు పాక్ సైని క నియంత జనరల్ ముషారఫ్ బలూచిస్తాన్‌లో పెద్ద ఎత్తున సైనిక స్తావరాలను ఏ ర్పాటు చేశారు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్( సిపెక్) ఏర్పా టు చేసి స్థానికేతరులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడం, వనరులను దోచుకోవడం, పంజాబీ ప్రాబల్యం పెరిగిపోవడం, దీనికి తోడు నవాబ్ అక్బర్ హత్య అక్కడి ప్రజల కు కోపం తెప్పించింది.

అప్పటినుంచి పాక్ సైన్యంపై, చైనా ప్రాజెక్టులపై బీఎల్‌ఏ తరచు దాడులు చేస్తూనే ఉన్నది. కాగా బీఎ ల్‌ఏను ప్రస్తుతం భషీర్ జెబ్ నడిపిస్తున్నాడు. ప్రత్యేక బలూచిస్తాన్ జాతీయవాద ఉద్యమానికి భారత్, వారి గూఢచార సం స్థలు ఆర్థికంగా, ఆ యుధాపరంగా అన్ని విధాల సహాయం చేస్తున్నాయని పాక్ పాలకులు ఆరోపిస్తూనే ఉన్నారు. బలూచ్ జా తీయ ఉద్యమానికి ప్రత్యక్షంగా స్వీడన్, నా ర్వే, ఒమన్, అరబ్ దేశాలు.. అఫ్గానిస్తాన్, భారత్‌లు పరోక్షంగా మద్దతిస్తున్నా యి. బ లూచిస్తాన్‌ను బలవంతంగా తమలో కలుపుకొని అక్కడి ప్రజలను అణిచివేస్తున్న పాక్ దోపిడీకి అడ్డుకట్ట పడి బలూచ్‌లు స్వాతంత్య్ర కాంక్షను పొందాలని ఆశిద్దాం.

  వ్యాసకర్త సెల్: 9000481768