4 May, 2026 | 3:13 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

బాల్క సుమన్‌కు కోర్టులో ఊరట

04-03-2026 12:00 AM
  1. బెయిల్ మంజూరు చేసిన చెన్నూర్ న్యాయస్థానం 
  2. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి నేడు విడుదయ్యే అవకాశం 

అదిలాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టులో ఊరట లభించింది. చెన్నూర్‌‚లో నమోదైన  కేసులో చెన్నూర్ కోర్టు న్యాయ మూర్తి బెయిల్ మంజురు చేస్తూ తీర్పుని చ్చారు. ఇప్పటికే మంచిర్యాల, రాయదుర్గం ఈ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కాగా, తాజాగా చెన్నూర్ కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో ఈ మూడు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న బాల్క సుమన్ బుధవారం ఉదయం విడు దల కానున్నారు.

చెన్నూర్ మున్సిపల్ ఎన్ని కల పోలింగ్ రోజు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బాల్క సుమన్ ధర్నా చేపట్టినం దుకు కేసు నమోదు చేసి సంగతి తెలిసిందే. ఈ కేసులో సుమన్ తరఫు న్యాయవాది వాదనలు విన్న జూనియర్ సివిల్ జడ్జ్ బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు.

అదేవిధంగా క్యాతనపల్లి ము న్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రాళ్లదాడి కేసులో సుమన్ అరెస్ట్ అయి గత నెల 18 నుంచి ఆదిలాబాద్ జిల్లా జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.ఈ కేసులో మంచిర్యాల జిల్లా కోర్టు గత రెండు రోజుల క్రితమే బెయి ల్ మంజూరైంది.రాయదుర్గం కేసులో సైతం బెయిల్ మంజూరైంది. దీంతో మొత్తం మూ డు కేసుల్లోనూ బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరైంది.