6 August, 2026 | 2:49 AM

తల్లిపాల విశిష్టతపై మెడిసిటీలో అవగాహన సదస్సు

06-08-2026 01:42 AM

మేడ్చల్ అర్బన్, ఆగస్టు 5(విజయక్రాంతి):ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల విశిష్టత,ఆవశ్యకతపై తల్లులకు,గర్భిణీలకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఘనపూర్ మెడిసిటీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ గీతా పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత ఆవశ్యకతతో పాటు అపోహాలపై వివరించినట్లు చెప్పారు.ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1నుండి 7 వరకు విశ్వవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశం తో అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో కలిసి పిల్లల తల్లులకు,గర్భిణీలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించినట్లు డాక్టర్ గీతా వెల్లడించారు.

అదేవిధంగా శిశువుకు అందించే ఆహారంలో తల్లిపాలు అన్నింటికన్నా శ్రేష్ఠమైనవని ఆమే అన్నారు.పిల్లలకు తల్లి పాలివ్వడంతో తల్లీబిడ్డల మధ్య అనుబంధం గట్టిపడుతుంది అందుకే శిశువుకు తల్లి స్వయంగా పాలివ్వాలని డాక్టర్ సూచించారు. మెడిసిటీ ఆసుపత్రి పిడియాట్రిక్ విభాగం డాక్టర్ సుదర్శన్ మాట్లాడుతూ తల్లి బిడ్డల మధ్య అనుబంధంతో పాటు తరతరాల అనుబంధం, రసత్వం కూడా శిశువుకు అందించిన వారవుతారని స్పష్టం చేశారు.

ఇలాంటి రహస్యాన్ని తల్లులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.సమాజంలో తల్లిపాలపై ఎలాంటి అపోహలు లేకుండా తల్లులు పిల్లలకు స్వయంగా పాలు పట్టాలని డాక్టర్ సుదర్శన్ సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇనాక్షి గంగూలీ.డాక్టర్ సమీర్.డాక్టర్ నాగరాజు.తల్లిలు,గర్భిణీ స్త్రీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.