7 April, 2026 | 3:59 AM

ట్రామా శస్త్ర చికిత్స పద్ధతులపై అవగాహన

07-04-2026 12:16 AM

‘పెల్విక్, ఎసిటాబ్యులమ్ అడ్వాన్స్‌డ్ ట్రామా కేర్’పై వర్క్‌షాప్

ఉస్మానియా మెడికల్ కాలేజీలో నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 6(విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్, ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సొసైటీ సంయుక్తంగా ‘పెల్విక్, ఎసిటాబ్యులమ్ అడ్వాన్స్‌డ్ ట్రామా కేర్’ అంశంపై జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించాయి.‘పెల్విక్, ఎసిటాబ్యులమ్ అడ్వానస్డ్ ట్రామా కేర్’పై జాతీయ స్థాయి వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు పాల్గొనగా,దాదాపు 200 మంది యువ ఆర్థోపెడిక్ వైద్యులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్లు హాజరై అత్యాధునిక ట్రామా శస్త్రచికిత్స పద్ధతులపై అవగాహన పొందారు.

ఈ వర్క్‌షాప్‌లో భాగంగా నిర్వహించిన క్యాడావర్ శిక్షణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మృతదేహాలపై ప్రత్యక్షంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ, పెల్విక్ ఎసిటాబ్యులమ్ గాయాలకు సంబంధించిన క్లిష్టమైన శస్త్రచికిత్స పద్ధతులను వైద్యులకు ప్రాక్టికల్‌గా వివరించారు. ఈ గాయాలు ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు, ఎత్తున ప్రదేశాల నుంచి పడిపోవడం, పారిశ్రామిక ప్రమాదాల వల్ల సంభవిస్తాయని నిపుణులు తెలిపారు.

ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని మాట్లాడుతూ, పెల్విక్ మరియు ఎసిటాబ్యులమ్ గాయాలు అత్యంత ప్రమాదకరమైనవని, బాధితులకు మొదటి ఆరు గంటల్లోపు సరైన చికిత్స అందకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఎక్కువగా ఉం టుందన్నారు.అందువల్ల అత్యవసర ట్రామా సర్జరీలపై యువ వైద్యులకు సమగ్ర అవగాహన కల్పిం చడం చాలా అవసరమన్నారు.ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పీఎల్ శ్రీనివాస్, చండీగడ్‌కు చెందిన ప్రము ఖ ట్రామా నిపుణుడు డాక్టర్ రమేష్ కుమార్‌సేన్‌తో కలిసి ఈ క్యాడావర్ వర్క్‌షాప్‌కు నాయకత్వం వహిం చి,క్లిష్టమైన ట్రామా కేసులను ఎలా స మర్థవంతంగా నిర్వహించాలి, పెల్విక్ రీకన్స్ట్రక్షన్, ఎసిటాబ్యులమ్ స ర్జరీలను ఎలా చేయాలనే అంశాలపై తమ అనుభవాలను పంచుకున్నారు.

దేశంలో పెల్విక్, ఎసిటాబ్యు లమ్ సర్జరీలలో నైపు ణ్యం కలిగిన సర్జన్లు చాలా పరిమిత సంఖ్యలో మా త్రమే ఉన్నారని, ఈ తరహా క్లిష్టమైన శస్త్రచికిత్సలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక ట్రామా యూనిట్లు, అత్యవసర సేవలు,హైఎండ్ ఇమేజింగ్ సదుపాయాలు,  ప్రపం చ స్థాయి మౌలిక వసతులు కలిగిన ఆసుపత్రులు అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ అన్ని సదుపాయాలు సికింద్రా బాద్‌లో అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. ఈ వర్క్‌షాప్ యువ ఆర్థోపెడిక్ వైద్యులకు ప్రాక్టికల్ శిక్షణ అందించడంతో పాటు, భవిష్యత్తులో క్లిష్టమైన ట్రామా కే సులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడే ఒక విలువైన వేదికగా నిలిచింది.