12 May, 2026 | 11:40 AM

Breaking News

మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •  

ఎయిడ్స్ పై అవగాహన ముఖ్యం: డాక్టర్ దీప్తి

28-11-2025 09:51 PM

కాటారం,(మహాముత్తారం),(విజయక్రాంతి): ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన ముఖ్యమని మహాముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ దీప్తి అన్నారు. శుక్రవారం కస్తూర్బా గాంధీ బాలికల గురుకులం జూనియర్ కళాశాలలో మహాదేవపూర్ ఐసీటీసీ, ఎస్ఎస్కె ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి విధానాలు, నివారణ చర్యలు, తదితర అంశాలపై ఐసీటీసీ కౌన్సిలర్ గాదె రమేష్ అవగాహన కల్పించారు. సంపూర్ణ సురక్ష కేంద్రం కార్యక్రమం గురించి వివరించారు.