కామారెడ్డి రక్తదాతల సమూహానికి 16 అవార్డులు
తలసేమియా సొసైటీ అవార్డులు అందజేత
రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
కామారెడ్డి, మే 10 (విజయక్రాంతి): కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రతినిధులకు 16 అవార్డులు తల సేమియా సికిల్ సెల్ సొసైటీ ప్రతినిధులు ఆదివారం పంపిణీ చేశారు. తల సేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదానం శిబిరాలు నిర్వహించి రక్తం సేకరించి ఇవ్వడం జరిగిందని రాష్ట్ర వైశ్య ఫెడరేషన్ చైర్మన్, రెడ్ గ్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. రక్తదాన శిబిరాలు2023 నుంచి 35 పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించి ఆరువేల యూనిట్లపై రక్తాన్ని సేకరించి ఇవ్వడం జరిగిందన్నారు.
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చిన్నారులకు కావాల్సిన రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరి నీ రక్తదాన శిబిరాలు బాధిత జిల్లాల కోసం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రక్తదాతల సింహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్, ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ, జాలిగామ శ్రీకాంత్, ఐ వి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్, ఐ వి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతి, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కస్వ వెంకటేష్, ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.






