28 July, 2026 | 1:10 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

అనురాగ్ యూనివర్సిటీ పరిశోధకుడు శ్రీకర్ ముత్తినేనికి పీహెచ్‌డీ ప్రదానం

09-03-2026 08:45 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి శ్రీకర్ ముత్తినేనికి, పీహెచ్‌డీ (డాక్టరేట్) పట్టా లభించింది. ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవ్ ట్రైన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నియంత్రణ వ్యూహాలు అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను యూనివర్సిటీ ఈ డాక్టరేట్‌ను ప్రకటించింది. శ్రీకర్ ముత్తినేని తన పరిశోధనను ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ టి. అనిల్ కుమార్ పర్యవేక్షణలో పూర్తి చేశారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల  వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, కృత్రిమ మేధస్సు ద్వారా ఆవాహనాల పనితీరును, సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరచవచ్చో ఈ పరిశోధనలో వివరించారు. శ్రీకర్ ముత్తినేని సమర్పించిన సిద్ధాంత గ్రంథం ఆయన కనుగొన్న నూతన నియంత్రణ పద్ధతులను ఎగ్జామినర్లు విద్యావేత్తలు ప్రశంసించారు. శ్రీకర్ ముత్తినేని సాధించిన ఈ ఘనత పట్ల అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం, ఈఈఈ విభాగం అధ్యాపకులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.