1 July, 2026 | 3:48 AM

అక్కయిలూ బాగున్నారా.. అంటూ సంక్రాంతికి వస్తారట!

01-07-2026 12:00 AM

ఈసారి సంక్రాంతికి మరో క్రేజీ కాంబో సిద్ధమవుతోంది. రవితేజ, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’, ‘శ్వాగ్’ చిత్రాల దర్శకుడు హసి త్ గోలి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్‌వీసీ) బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నారని టాక్. శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడం విశేషం.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు బలమైన కమర్షి యల్ మెసేజ్ కలిగిన కథతో రూపుదిద్దుకోనుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మేకర్స్ ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

ఫిలింనగర్ టాక్ ప్రకారం ఈ సినిమాకు ‘అక్కయిలూ బాగున్నారా..’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది. అది పూర్తయిన తర్వాత ఆగస్టు నుంచే ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటనను మేకర్స్ త్వరలోనే చేయనున్నారు.