14 July, 2026 | 3:28 PM

Breaking News

చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •  

మర్రిగూడ ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆశావర్కర్ల ధర్నా

23-12-2025 04:36 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండల కేంద్రంలోని స్థానిక పీహెచ్సీ ముందు ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ధన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో లెప్రసీ సర్వే చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆరోగ్యశాఖ అధికారులు ఆశలను ఆదేశించారు. కానీ గతంలో సర్వే చేస్తే అట్టి డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదని దానికి నిరసనగా  ధర్నా చేసి స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాలినికి పలు డిమాండ్ల తూ కూడిన వినతి పత్రం అందజేసి పరిష్కరింప చేయాలని కోరారు.

ఈ కార్యక్రమము లో సి.ఐ.టి.యు.జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య  మాట్లాడుతూ డిసెంబర్ లో చేసే లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని గతంలో పెండింగ్లో ఉన్న లెప్రసీ పల్స్ పోలియో ఎలక్షన్ డ్యూటీ డబ్బులు వెంటనే చెల్లించాలని, ఫిక్స్డ్ వేతనం 18000 చెల్లించాలని కోరారు, పరిష్కరించాలని  ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ ,జంపాల వసంత, సిఐటియు మండల కన్వీనర్ ఏర్పుల పద్మ, విజయ ,రోజా, ఎస్కే సైదాబీ, వారాలశోభ, పల్లె కంసల్య, పగడాల బాలమణి, పొనుగోటి సునీతమ్మ ,కలకొండ. వెంకటమ్మ, పొగాకు సునిత, సునీత, మమత, ముత్యాలి,తదితరులు పాల్గొన్నారు