1 July, 2026 | 1:52 AM

హైలెస్సోలో లైలం బాబుగా..

01-07-2026 12:00 AM

సుధీర్ ఆనంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హైలెస్సో’. ప్రసన్నకుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం లో నటుడు శివాజీ ‘లైలం బాబు’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మంగళవారం శివాజీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్.. ఈ సినిమాలో ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో నల్లటి దుస్తులు, పంచెకట్టుతో రాతి సింహాసనంపై కూర్చొని, చేతిలో సీసా పట్టుకుని శివాజీ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ కన్నడ నటి అక్షర గౌడ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్; డీవోపీ: సుజాత సిద్ధార్థ్; ఎడిటర్: చోటా కే ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి.