భద్రాచలం డీఎస్పీగా అరుణ్ కుమార్
04-05-2026 01:52 AM
భద్రాచలం, మే 3, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిఎస్పీగా అరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అరుణ్ కుమార్ గతంలో కరకగూడెం ఎస్త్స్రగా విధులు నిర్వహించడంతోపాటు, మణుగూరు ప్రాంతంలోనూ పనిచేశారు. అనంతరం హైదరాబాద్ ఇంటెలిజెన్సీ విభాగంలో పనిచేస్తూ భద్రాచలం డిఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన విధి నిర్వహణలో పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం భద్రాచలం డిఎస్పీగా బాధ్యతలు చేపట్టడం తో పలువురు ఆయనను అభినందించారు.






