17 July, 2026 | 2:22 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

వేటగాళ్ల అరెస్టు

07-03-2026 12:00 AM

పెంచికల్‌పేట, మార్చి 6 (విజయక్రాంతి): మండలంలోని అటవీ ప్రాంతం లో కరెంట్ తీగలతో వేటాడిన ఘటనను అటవీ శాఖ అధికారులు వెలుగు లోకి తీసుకొచ్చారు. హోలీ పండుగ సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్న సిబ్బందికి కాళీమాత గుడి సమీపంలోని పెద్దవాగు ప్రాంతం లో వేట జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. గతంలో నేరాల్లో పాల్గొన్న అప్పా జీ శ్రీనివాస్ ఇంటిపై పెంచికల్పేట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అస్మా ఆధ్వర్యంలో మార్చి 5న సోదాలు నిర్వహించారు.

సోదాల్లో ఇంట్లో వండిన అడవి పంది మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అప్పాజీ శ్రీనివాస్ అతని అన్నలు అప్పాజీ బుచ్చన్న (ఎల్లూరు), అప్పాజీ గణపతి (పెంచిక ల్పేట) కలిసి మార్చి 4న పెద్దవాగు సమీపంలోని చేనులో కరెంట్ తీగలు వేసి అడవి పందిని వేటాడినట్లు తేలిం ది. వేటాడిన మాంసాన్ని మధ్యవర్తులకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అడవి జంతువులను వేటాడడం, వాటి మాంసాన్ని కొనుగోలు చేయడం లేదా విక్రయించడం అటవీ చట్టం ప్రకారం నేరమని అధికారులు హెచ్చరించారు.