21 August, 2026 | 9:46 PM

Breaking News

పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •   భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం   •  

దొంగతనానికి యత్నించిన నిందితుడి అరెస్టు

21-08-2026 12:00 AM

14 రోజులపాటు రిమాండ్

శంకర్‌పల్లి ఆగస్టు 20 (విజయక్రాంతి): ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి యత్నించిన నిందితుడిని అరెస్టు చేసి 14 రోజులపాటు రిమాండ్ తరలించారు. ఎస్త్స్ర సురేష్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎల్బీనగర్, ఫతేనగర్ హైదరాబాద్ చెందిన నింధితుడు వేముల నరసింహ (చీమ కండ్ల నరసింహ) మద్యం, సిగరెట్లకు బానిసై దొంగతనాలు చేయడం మొదలు పెట్టడం తెలిపారు. బుధవారం పట్టణ కేంద్రంలోని  వివిధ ప్రాంతాలను తిరుగుతూ దొంగతనానికి అనువైన ఇంటి కోసం వెతికాడని తెలిపారు.

పట్టణంలోని బ్లూవుడ్స్ వెంచర్లు లో ఉన్న ఇంటిని గమనించి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకొని, అదే సరైన సమయంగా భావించి తన వెంట తీసుకువచ్చిన ఇనుప రాడ్డుతో ఇంటి తాళం పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా చుట్టుపక్కల వారికి శబ్దాలు రావడంతో నిందితుడిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి నుంచి ఒక ఇనుప రాడ్డు, మొబైల్ ఫోను సీజ్ చేశారు. నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచి 14 రోజులపాటు రిమాండ్ కు పంపడం జరిగిందని పోలీసులు తెలిపారు.