మూడు నెలల రేషన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
పౌరసరఫరాల డీఎం సుగుణ బాయి
మేడ్చల్, జూలై 22 (విజయ క్రాంతి): జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని పౌరసరఫరాల డిఎం సుగుణ బాయి తెలిపారు. ఆరు ఎం ఎల్ ఎస్ పాయింట్ల ద్వారా జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని, అక్కడి నుంచి లబ్ధిదారులకు అందుతాయన్నారు. రేషన్ కార్డు దారులు కార్డుతో పాటు, ఆధార్ కార్డు తీసుకొని వెళ్లాలన్నారు.
బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావు లేదని, ఎక్కడైనా డబ్బులు వసూలు చేసిన, బియ్యం పక్కదారి పట్టిన తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. లబ్ధిదారులందరికీ రేషన్ బియ్యం అందుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డుదారులందరూ ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఈ కేవైసీ చేయించుకొని వారికి రేషన్ బియ్యం అందబోవని ఆయన స్పష్టం చేశారు.






