18 April, 2026 | 10:26 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

‘ఆరావళి’లో 90% రక్షిత ప్రాంతమే

23-12-2025 02:09 AM

కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కేవలం ఖనిజాల తవ్వకం కోసమే ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని తాము మార్చినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఆ పర్వత శ్రేణుల్లో 90% విస్తీర్ణం రక్షిత ప్రాంతమేనని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. సమ గ్ర నిర్వహణ ప్రణాళిక ఖరారయ్యేవరకు ఆ ప్రాంతంలో కొత్త గనుల తవ్వకానికి లీజులు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయాన్ని గుర్తుచేసింది. కోర్టు ఆమోదించిన నిర్వచనం ప్రకారం ఆరావళిలో 90% పైగా రక్షిత ప్రాంతంగా ఉంటుందని తేలిచెప్పింది. 1.44 లక్షల చదరపు కి.మీ మేర విస్తరించిన ఈ పర్వత శ్రేణుల్లో 0.19% మైనింగ్ కోసం వినియోగించుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది.