2 July, 2026 | 4:12 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

బీజేపీ మండల నూతన కార్యవర్గం నియామకం

15-04-2026 03:05 PM

మానకొండూరు,(విజయక్రాంతి): బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు, బిజెపి మండల  అధ్యక్షులు కంది రాజిరెడ్డి మానకొండూరు మండల కార్యవర్గాన్ని బుధవారం ప్రకటించి,  నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మండల ఉపాధ్యక్షులుగా ఆరెల్లి శ్రీహరి, ఎదులాపురం అశ్విన్ తేజ, మీస రమణయ్య, పోచంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా శీలం కుమార్, భాషాబోయిన ప్రదీప్, కార్యదర్శులుగా మార్క సుమతి,కోల శ్రీనివాస్, రావుల తిరుపతి, బొంపల్లి రమేష్,కోశాధికారిగా డొల్ల సతీష్ ,  కార్యవర్గ సభ్యులుగా 34 గురు కార్యవర్గ  సభ్యులను నియమించారు. యువ మోర్చా మండల అధ్యక్షులుగా కొండ్ర వరప్రసాద్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులుగా అడప రవి, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులుగా అంబటి స్వామి, మహిళా మోర్చా మండల అధ్యక్షులుగా ఆవుదరి విజయ ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పటిష్టత కోసం కష్టపడి క్రమశిక్షణతో పనిచేయాలని నూతన సభ్యులకు కందిరాజి రెడ్డి సూచించారు.