నేటి నుంచి మరో విడత గోదావరి జలాలు
10-04-2026 12:00 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 9: రైతుల అభ్యర్థన మేరకు యాసంగి సీజన్ కు సంబంధించి నేటి నుంచి(శుక్రవారం)ఈ నెల 17 వరకు మరో విడత గోదావరి జలాలను జిల్లాకు విడుదల చేయాలని నిర్ణ యించినట్లు జల వనరుల శాఖ తిరుమలగిరి డివిజన్ -2 ఈఈ సత్యనారాయణ గౌడ్, బయ్యన్న వాగు ఏఈ చంద్రశేఖర్ లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం వరి పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయని,నీటి విడుదలను నిలిపివేస్తే పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతామని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రైతుల అ భ్యర్థన మేరకు చివరి విడతగా(7వ)మరో వారం రోజులు నీటిని విడుదల చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.రైతులు ఆందోళన చెంద వద్దని,నీటిని వృధా చేయకుండా పంటలకు వాడుకోవాలని కోరారు.




