21 August, 2026 | 4:15 AM

‘విలేజ్ స్టార్స్’ ప్రారంభం

21-08-2026 12:00 AM

తెలుగు తెరపైకి మరో బ్యూటిఫుల్ ఎంటర్‌టైనర్ రాబోతొంది. ఎన్‌ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న నూతన చిత్రం ‘విలేజ్ స్టార్స్’ బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి నటుడు సమీర్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, జబర్దస్త్ నటుడు వాసు, సామాజిక కార్యకర్త సంపత్, నటుడు రాధాకృష్ణ పాల్గొన్నారు.

నరేంద్ర, లిల్లీ బళ్లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్, సయ్యద్ అబ్జాల్, విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ నరేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నాగూర్ ఎన్జీఆర్ కథ అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.