calender_icon.png 16 February, 2026 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరాచక కాంగ్రెస్!

16-02-2026 01:39:20 AM

హంగ్ ఉన్న చోట అధికార పార్టీ గుండాగిరి.. కార్పొరేటర్లు, కౌన్సిలర్లపై దౌర్జన్యం

  1. లొంగితే ప్రలోభాలు.. లేదంటే ఎత్తుకుపోవడం
  2. కుదరకపోతే పోలీసులతో బెదిరింపులు సింగరేణిలో దోపిడీ అడ్డుకోవడమే బీఆర్‌ఎస్ లక్ష్యం
  3. కార్మికుల ప్రయోజనాల కోసమే కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు కానీ వారిపై ఏమి ఒత్తిడి ఉందో తెలియదు
  4. కాంగ్రెస్‌తో పొత్తుకు ఎందుకు ఒప్పుకుందో వాళ్లకే తెలియాలి సేవాలాల్ జయంతి వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి) : రాష్ట్రంలో హంగ్ ఏర్పడిన చోట అధికార పార్టీ అరాచకం సృష్టిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో దాదాపు 34 చోట్ల హంగ్ పరిస్థితులు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలకు అంతే లేదన్నారు.

కార్పొరేటర్లు, కౌన్సిలర్లు లొంగితే ప్రలోభపెట్టడం లేదంటే గుండాలను ఉప యోగించి ఎత్తుకుపోవడం, అదీ కుదరకపోతే పోలీసులను ఇంటింటికి పంపించి బెదిరించడం వంటి చర్యలకు దిగుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాలు, మున్సిపల్ రాజకీయ పరిస్థితులు, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, పండుగ శుభాకాంక్షలపై స్పందించారు.

సింగరేణి కార్మికుల హక్కుల కోసం..

సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కొత్తగూడెంలో బీఆర్‌ఎస్ తన మద్దతు సీపీఐకి ప్రకటించిందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి సింగ రేణి దోపిడీలో భాగస్వాములై సంస్థను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సీపీఐ, కాంగ్రెస్ ఇప్పటికే అలయన్స్‌లో ఉన్నాయని, కొత్తగూడెంలో మేయర్ పదవి పంచుకోవడంలో ఆశ్చ ర్యం ఏమీ లేదన్నారు.

అయితే ఏఐటీయూ సీ వంటి సీపీఐకి అనుబంధ సంస్థ కూడా ఈ పొత్తును ఎందుకు అంగీకరించిందో తెలియదన్నారు. దాని వెనుక ఏ ఒత్తిళ్లు పనిచేశాయో తాను చెప్పలేనని వ్యాఖ్యానించారు. అయితే ఎవరు కలిసి వచ్చినా, కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కుల కోసం గతంలో ఎట్లా పోరాడామో భవిష్యత్తులో కూడా అలాగే పోరాడుతామని కేటీఆర్ స్ప ష్టం చేశారు.

జల్‌ఏ స్ఫూర్తితో కేసీఆర్ పాలన 

కొమురం భీమ్ నాయకత్వంలో జరిగిన జల్, జంగల్, జమీన్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ అడవులు, భూములు, నీళ్ల విష యంలో న్యాయం చేస్తూ గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచామని కేటీఆర్ తెలిపారు. గిరిజన పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయ డం బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఘనత అని చెప్పా రు.

రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి గిరిజన యువతకు మెరుగైన అవ కాశాలు కల్పించామని గుర్తు చేశారు. బంజారాహిల్స్‌లో సేవాలాల్ బంజారా భవన్ ని ర్మాణం ద్వారా గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని, రాష్ట్రవ్యాప్తంగా సేవాలాల్ భవనాల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేసినట్లు చెప్పారు.

సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా గిరిజన గౌరవానికి నిదర్శనమని అన్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు అం డగా నిలబడతామని కేటీఆర్ హామీ ఇచ్చా రు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  

బీఆర్‌ఎస్ హయాంలో గిరిజనులకు న్యాయం..

‘మా తండాల్లో మా రాజ్యం ఉండాలి’ అ న్న నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని తెలంగాణ భవన్‌లో జరుపుకోవడం ఆనందంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ఈ కార్య క్రమంలో మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, భుక్యా జాన్సన్ రాథోడ్, వాల్యా నాయక్, రామచంద్రు నాయక్, రాంభల్, గాంధీ నాయక్, కరాటే రాజు, శ్రీనివాస్ గౌడ్ తదితర నేతలతో కలిసి భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గిరిజన గూడాలు, కోయ గూడాలు, లంబాడా తండాలకు ప్రాధాన్యం ఇస్తూ 3,146 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి వేలాది గిరిజన యువతకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా అవకాశాలు కల్పించారని చెప్పారు. దాదాపు 30 వేల మంది వార్డు సభ్యులు గిరిజన వర్గాల నుంచి ఎదిగారని వివరించారు. అలాగే ఒకే రోజు సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల భూమి హక్కులను రక్షించిందీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.