1 June, 2026 | 2:46 AM

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటమే కాసానికి ఇచ్చే ఘనమైన నివాళి

01-06-2026 12:06 AM

కాసాని అయిలయ్య స్తూపావిష్కరణ సభలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

భద్రాద్రి కొత్తగూడెం, మే 31, (విజయక్రాంతి): ఆర్థిక అసమానతలు దోపిడీ లేని సమాజం కోసం పేదోడి రాజ్యం రావాలని తన తుదిశ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప కమ్యూ నిస్టు కాసాని ఐలయ్యని సిపిఎం పొలిటి బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి కార్యదర్శి రాష్ట్ర నేత కాసాని ఐలయ్య స్మారక స్తూపావిష్కరణ కార్యక్రమం సుజాతనగర్ లో జరిగింది.

కొత్తగూడెంలో సెవెన్ హిల్స్ దగ్గర నిర్మించిన కాసాని స్థూపాన్ని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం సాయిబాబా ఆవిష్కరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ జెండావిష్కరణ చేశారు. అనంతరం కొత్తగూడెం నుండి సుజాతనగర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుజాత నగర్‌లో నిర్మించిన కాసాని ఐలయ్య స్తూపాన్ని బివి రాఘవులు ఆవిష్కరించారు. 

అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ కొత్తగూడెం ప్రాంతంలో పార్టీ విస్తరణకు అలుపెరగని కృషిచేసిన కాసాని ఐలయ్య లాంటి ప్రజా నాయకుడు లేకపోవడం పార్టీకి తీవ్రమైన లోటన్నారు. కాసాని ఆశయ బాటలో ప్రజల కోసం ముందుకు సాగాలని పిలుపుని చ్చారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఏం సాయిబాబు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు నున్న నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య ఎజె రమేష్  న్యాయవాదులు జలసూత్రం శివరాం, ప్రసాద్ రెడ్డి ,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.