23 June, 2026 | 2:44 AM

జిల్లాకో ‘ఇంటిగ్రేటెడ్ భూ భారతి’

23-06-2026 12:00 AM
  1. నూతన విధానంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
  2. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి, భూ పరిపాలనను పారదర్శకంగా మార్చడానికి ఇంటిగ్రే టెడ్ భూ భారతి విధానాన్ని ప్రవేశపెట్టి నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార  పౌరసంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి  స్పష్టం చేశారు. దీని కింద రాష్ట్రం లో ప్రతి జిల్లాకు ఒక మండలం చొప్పన ఇంటిగ్రేటెడ్ భూ భారతి విధానాన్ని విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. 

కార్యాలయా ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా రైతులకు స్పష్టంమైన భూ హక్కులు, చట్టబద్ధమై న రక్షణ కల్పించడం ఈ నూతన విధానం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. సోమవారం రెవెన్యూ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రెవెన్యూకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి  నాయకత్వంలో భూసమస్యల పరిష్కా రానికి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు.

అందుకోసం ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చి ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ద్వారా పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూ పేందుకు ప్రతి సర్వే నంబరుకు ఆధార్ తరహాలోనే ప్రత్యేకమైన భూధార్ నంబర్‌ను కేటాయించడం జరగుతుందని స్పష్టం చేశారు. భూభారతి చట్టం వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.65లక్షల వరకు కొత్త పాస్‌పుస్తకాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ భూభారతి విధానం అమలుపై మంత్రి సమీక్షించగా.. విజయవంతంగా కొనసాగుతుం దని అధికారులు వివరించారు. నూతన విధానం జిల్లాకో మండలంలో అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సాదాబైనామాల పరి ష్కారంలో వేగంపెంచాలని మంత్రి సూచించగా.. రాష్ట్రవ్యాప్తంగా 9.25 లక్షల దరఖా స్తుల్లో ఇప్పటివరకు 6 లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు. మిగిలిన వారికి 15 రోజుల్లో నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.