14 June, 2026 | 1:47 AM

యువ దర్శకులకు ఆదర్శం.. ‘సింగ్ గీతం’

14-06-2026 12:21 AM

వైవిధ్యభరితమైన చిత్రాలతో సగటు ప్రేక్షకుడిని మెప్పించిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరోసారి తన సృజనాత్మకతను చాటారు. కళాతృష్ణకు వయసుతో సంబంధం లేదని ఆయన నిరూపించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘సింగ్ గీతం’ సినిమా ఇప్పుడు పరిశ్రమలో సరికొత్త చర్చకు తెరలేపింది. ప్రస్తుత తరం సరికొత్త సాంకేతికతతో సినిమాలు తీస్తున్నప్పటికీ, సింగీతం శ్రీనివాసరావు చూపించిన మేకింగ్ స్టైల్ అద్భుతంగా ఉందనే ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ చిత్రం నేటి తరం యువ దర్శకులకు ఒక పాఠ్యపుస్తకంగా నిలిచింది. మానవాళి మనుగడకు, మానవ సంబంధాల ప్రాముఖ్యతకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు సింగీతం. ప్రకృతి ఆరాధన ప్రస్తుత సమాజానికి అత్యంత అవసరమన్న అద్భుతమైన సందేశాన్ని అందించిందీ చిత్రం. 90 ఏళ్ల వయసులో సింగీతం తీసిని ఈ సినిమా నుంచి ఇప్పటి దర్శకులు ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.