పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
01-06-2026 12:03 AM
రాజాపూర్ మే 31: మండలంలోని రాజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 1983-1984 విద్యా సంవత్సరం చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వేడుకలు ఆదివారం మండల కేంద్రంలోని పంక్షన్ హల్ లో ఘనంగా నిర్వహించారు. దాదాపు 45 సంవత్సరాల తర్వాత కలుసుకున్న తమ చిన్ననాటి మిత్రులను ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకుని చిన్ననాటి జ్ఞాపకాలు నేమరు వేసుకున్నారు. తమకు చదువు గుర్తు చేసుకొని మృతి చెందిన ఉపాధ్యాయులకు నివాళులు అర్పించారు.తమకు విద్యార్థులు నేర్పిన ఉపాధ్యాయులను పూలమాలలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్యయ్య, తాహేర్ పాషా, గిరి, శ్రీనివాస్,వెంకయ్య, మజీద్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






