కిమ్స్ కడల్స్ వైద్యుల ఘనత
28 రోజుల శిశువుకు కొత్త ఊపిరి
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): శ్వాసనాళం తీవ్రంగా ఇరుకుగా మారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న 28 రోజు ల శిశువుకు కిమ్స్ కడల్స్ కొండాపూర్ వైద్యులు ట్రాకియోస్టమీ అవసరం లేకుండా విజయవంతంగా చికిత్స అందించారు. శిశువు పుట్టిన వెంటనే శ్వాస తీసుకోలేక ఏడు రోజుల పాటు వెంటిలేట్ప ఉండటంతో పాటు న్యుమోనియా, పల్మనరీ హైపర్టెన్షన్, గుండె సమస్యలతో చికిత్స పొందింది.
అనంతరం తీవ్ర శ్వాస ఇబ్బందులు, ఛాతీ లోపలికి పడిపోవడం, పెద్ద శబ్దంతో శ్వాస తీసుకోవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షల్లో శ్వాసనాళం దిగువ భాగంలో గ్రేడ్-2 సబ్గ్లోట్టిక్ స్టెనోసిస్ ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఈ వయస్సు శిశువుకు 3 లేదా 3.5 సైజు ట్యూబ్ అవసరం కాగా, కేవలం 2.5 సైజు ట్యూబ్ మాత్రమే అమర్చగలిగారు. వైద్యులు ఎండోస్కోపిక్ బెలూన్ డైలటేషన్ విధానంలో 6 మిల్లీమీటర్ల బెలూన్ను ఉపయోగించి మూడు సార్లు చికిత్స అందించారు. దీంతో శ్వాసనాళం తెరుచుకుని గాలి సవ్యంగా వెళ్లే పరిస్థితి ఏర్పడింది.
శిశువు వయస్సు తక్కువగా ఉండటం, శ్వాసనాళం చిన్నగా ఉండటంతో పాటు ఇతర ఆరో గ్య సమస్యలు ఉండటంతో ఈ చికిత్స సవాలుతో కూడుకున్నదని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ ట్రాకియోస్టమీ అవసరం లేకుండానే శిశువు సహజంగా శ్వాస తీసుకునేలా చేయగలిగారు. కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ డా. ప్రియాంక వల్లూరి, నియోనాటాలజీ అకడమిక్స్ అండ్ రీసెర్చ్ రీజినల్ డైరెక్టర్, కిమ్స్ కడల్స్ తెలంగాణ యూనిట్స్ నియోనాటాల జీ విభాగాధిపతి డా. అపర్ణ, నియోనాటాలజిస్ట్ మరియు పీడియాట్రీషియన్ డా. విశ్వనాథ్ నంద్యాల పర్యవేక్షణలో శిశువు కోలుకుని విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యింది.






