25 April, 2026 | 4:05 AM

నేను తీసిన సినిమాల్లో జెట్లీ చాలా టఫ్!

25-04-2026 12:45 AM

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేశ్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి చెర్రీ, హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. ఈ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగులోకి అరంగేట్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా విశేషాలు డైరెక్టర్ రితేశ్ రానా మాటల్లో.. “2020లో కోవిడ్ సమయంలో జయేంద్ర అనే రచయితతో కలిసి ఈ కథను డెవలప్ చేశాను. అప్పట్నుంచే ఈ సినిమా చేయాలనుకుంటున్నాం. గత నవంబర్‌లో ప్రారంభించాం. నేను తీసిన సినిమాల్లో ఇది చాలా టఫ్ మూవీ. పూర్తిగా థ్రిల్లర్ కాకుండా, కొంత హ్యూమర్ ఉన్న థ్రిల్లర్‌గా చేయాలనుకున్నాం. దుబాయ్ నుంచి కొచ్చికి ల్యాండ్ అయ్యే జర్నీలో జరిగే కథ ఇది. ఫ్లైట్ సెట్ వేశాం.

ఇందులో రెండు కీలక సీక్వెన్సులున్నాయి. వాటి సీజీకి నాలుగు నెలలు పట్టింది. మొదట అవే షూట్ చేసి, మిగతా టైమ్ సీజీకి వాడుకున్నాం. షూటింగ్ దాదాపు 80% ఫ్లైట్‌లోనే జరుగుతుంది. కొందరితో మాట్లాడినప్పుడు ఈ టైమ్‌లో అలాంటి ప్రయోగం అవసరమా అన్నారు. తర్వాత సత్య తో ఈ సినిమా చేయాలనిపించింది. సత్యకి తగ్గట్టు క్యారెక్టర్ మార్చి తెరకెక్కించాం. మొదట ఈ కథలో సత్య పాత్ర ఫ్లైట్ అటెండర్ అనుకున్నాం. తర్వాత ‘నువ్వే హీరో’ అని చెప్పినప్పుడు షాక్ అయ్యారు.

మొదట రిస్క్ అన్నారు. కానీ నేను దీన్ని ఎలా తీస్తానో వివరంగా చెప్పిన తర్వాత ఎక్సైట్ అయ్యారు. ఆయన క్యారెక్టర్‌లో సీరియస్‌నెస్, హ్యూమర్, సస్పెన్స్.. అన్నీ ఉంటాయి. జెట్ లీ అనే నటుడు ఉన్నారు. అలాగే కథ జెట్‌లో జరుగుతుంది కాబట్టి ఆసక్తిగా ఉంటుందని టైటిల్ ‘జెట్లీ’ అని పెట్టాం. వెన్నెల కిషోర్ సినిమా అంతా సుడోకు ఆడుతుంటారు.

పరిస్థితులకు తగ్గట్టు సినిమా టైటి ల్స్ రాస్తుంటారు. చాలా టిపికల్ క్యారెక్టర్. సినిమా వర్కౌట్ అయి తే సీక్వెల్‌కు మంచి స్కోప్ ఉం ది. క్రేజీ మోహన్ కామె డీ స్టైల్ నాకు చాలా ఇష్టం. సెటైర్, సర్కాసం కూ డా ఇష్టం. హాలీవుడ్ కామెడీని కూడా ఇష్టపడతా. నాకు హారర్ జానర్ చాలా ఇష్టం. త ర్వాత చేయబోయేది హారర్ సి నిమానే. ఇది కొ త్తవాళ్లతో చేసే అవకాశం ఉం ది” అన్నారు.