17 April, 2026 | 2:47 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

భావితరాలకు స్ఫూర్తి అంబేద్కర్

14-04-2026 12:40 AM

సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు నిరంతరాయంగా కృషి చేసిన మహానీయుడు, దేశ భవిష్యత్‌ను ముందుగానే ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్. అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయం తి సందర్భంగా సీఎం ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం చేసిన కృషిని కొనియాడారు.

బాబాసాహెబ్ ఆలోచనల నుంచి ప్రేరణ పొందిన ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకుందని సీఎం గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయటంతో పాటు రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రభు త్వ సంక్షేమ హాస్టళ్లలో గతంలో ఎప్పు డూ లేని విధంగా మెస్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు.