28 July, 2026 | 1:10 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

ఆకట్టుకున్న పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

09-06-2026 12:32 AM

మంచిర్యాల టౌన్, జూన్ 8 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సినిమావాడ) 2006- బ్యాచ్ కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సోమ వారం ఘనంగా నిర్వహించారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులంతా ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని వారి మధుర జ్ఞాపకాలను నెమరువెసుకొని అనందంగా గడిపారు.

విద్యాబుద్దులు నేర్పించిన అప్పటి గురువులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత మంచిర్యాల ఎంఈవో, అప్పటి ప్రధానోపాధ్యాయురాలు మాళవిక, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయురాళ్లు సత్తయ్య, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, శ్రీలేఖ, సుజాత, సుమలత, సువర్ణ, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.