13 August, 2026 | 12:17 AM

ఘనంగా ఎఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

12-08-2026 09:33 PM

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించమని. మండల కేంద్రంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి తాళ్లపల్లి వినయ్ అలాగే సిపిఐ గిరిజన రాష్ట్ర నాయకులు కొమరం హనుమంతు మాట్లాడుతూ... భారత  స్వాతంత్ర్యమే లక్ష్యంగా ఉద్యమాలు చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమే అన్నారు.

దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్,ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబృద్దీన్, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల నాయకత్వాన 1936 ఆగస్టు12న ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిదన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదుల బానిస చేరల నుంచి మాతృభూమి విముక్తి కై సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో  విద్యార్థి సంఘం కదం తొక్కిందన్నారు. భరతమాత బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిషోరులను బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశములోనే ఏకైక విద్యార్ధి సంఘం ఏఐఎస్ఎఫ్ అన్నారు.