2 March, 2026 | 8:42 AM

వ్యవసాయ మెలకువల ప్రదర్శన

02-03-2026 12:00 AM

అశ్వారావుపేట, మార్చి 1 (విజయక్రాంతి) : వ్యవసాయంలో వ్యవహరించాల్సిన మెలుకువులను  వ్యవసాయ కళాశాల  అసోసియట్  డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ రైతులకు తెలియజే శారు. జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నాలుగో రోజులో భాగంగా  ఆదివారం రైతులకు నేలలో తేమ శాతాన్ని కొలిచే విధానాన్ని పద్ధతి ప్రదర్శన చేసి చూపించారు. అలాగే పంటలలో నీటిపారుదలని విధానాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులు గ్రామంలోని సూర్యమండల మోడల్ ని సందర్శించారు.

దీనిలో కూరగాయలు, దుంపలు మరియు పండ్ల సాగు చేసే విధానాన్ని పరిశీలించారు. రైతులను అడిగి తమ సందేహాలని నివృత్తి చేసుకున్నారు. తదుపరి పంటలకి పంచగవ్య,  ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారీ విధానాన్ని గురించి తెలుసుకున్నారు. పంటలలో క్రిమిసంహారక మందులని  పిచికారి చేసే విధానాన్ని రైతులకు వివరించారు.

వయ్యారి భామ కలుపు నిర్మూలించి మరియు ఆ మొక్క వలన కలిగే హానికరమైన ప్రభావాలని రైతులకి వివరించారు. అనంతరం వారు పొగాకు రైతులతో కలిసి క్యూరింగ్ విధానాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం అసోసియేట్ డీన్ డా. హేమంత కుమార్ గారి నేతృత్వంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.స్రవంతి, డా. శ్రీజన్ మరియు డా.ఝాన్సీ రాణి లు నిర్వహించారు.