calender_icon.png 16 February, 2026 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయాలకు నాకు సంబంధం లేదు: నటి త్రిష

16-02-2026 02:25:18 PM

నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీశారు

బీజేపీ నేత వ్యాఖ్యలకు త్రిష కౌంటర్

చర్యలు తప్పవని హెచ్చరిక

నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి

చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్(BJP leader Nainar Nagendran) వ్యాఖ్యలకు ప్రముఖ నటి త్రిష(Actress Trisha) కౌంటర్ ఇచ్చారు. టీవీకే చీఫ్, విజయ్(Vijay)తో త్రిష బంధంపై నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని సినీనటి ఆవేదన వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీశారని తెలిపింది. రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. అనవసర వివాదాల్లోకి లాగితే న్యాయపరమైన చర్యలు తప్పవని త్రిష హెచ్చరించారు.