22 April, 2026 | 10:04 PM

లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు

22-04-2026 08:53 PM

140 వాహనాల సీజ్ ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి

​కరీంనగర్ క్రేమ్,(విజయక్రాంతి): పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా టీవీఎస్ క్సల్ వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య మరియు సిబ్బంది నిఘా పెట్టారు.

​ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 140 వాహనాలను తాత్కాలికంగా నిర్బంధించి, ఎంవీ యాక్ట్ ప్రకారం జరిమానాలు విధించారు. అనంతరం వాహనదారులకు పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి హెచ్చరించారు. పట్టణంలో రహదారి భద్రత కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ ఏసీపీ  స్పష్టం చేశారు.