కరీంనగర్ సీపీపై చర్యలు తీసుకోవాలి
29-03-2026 12:00 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): కరీంనగర్ సీపీపై చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఏకే-47, పిస్టల్‌తో 180 రౌండ్లు గాలిలో ఫైరింగ్ చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ హోమ్‌గార్డుల నుంచి డబ్బులు వసూలు చేసి వారికి పోస్టింగ్‌లు ఇచ్చారని, తాను చెప్పేవి తప్పయితే ముక్కు నేలకు రాస్తానని చెప్పారు.




