18 July, 2026 | 6:51 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

అక్రమాస్తుల కేసు.. అడిషనల్ కలెక్టర్ ఇంట్లో సోదాలు

21-01-2026 12:26 PM

హైదరాబాద్: హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు సంబంధించి హైదరాబాద్ లోని బోడుప్పల్ లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో అధికారులు ఆ అధికారికి చెందినవని ఆరోపించబడుతున్న నగదు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

గత ఏడాది డిసెంబర్‌లో రూ.60,000 లంచం తీసుకుంటూ వెంకట్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఘటన తర్వాత అతడిని సస్పెండ్ చేశారు. అధికారుల సమాచారం ప్రకారం... ఒక పాఠశాలకు అనుమతి ఇవ్వడం కోసం  లంచం తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.