18 August, 2026 | 2:40 PM

లింగాల ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

18-08-2026 02:05 PM

లింగాల: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుమారు గంటపాటు కొనసాగుతున్న ఈ తనిఖీల్లో కార్యాలయంలోని రికార్డులు, సంబంధిత దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే తనిఖీలకు గల పూర్తి కారణాలు, ఏవైనా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయా అనే విషయాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. తనిఖీలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో కార్యాలయంలో జరుగుతున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది.