వేసవి నృత్య శిబిరం ప్రారంభం
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వెన్నెల డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని బుధవారం ప్రముఖ వైద్యులు చంద్రిక వ్యాపారవేత్త మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. సర్వ కళల సమాహారమే నృత్యాలని,వేసవిలో వెన్నెల డ్యాన్స్ అకాడమీ శిక్షణ నృత్యాలపై ఆసక్తిని చూపి,చక్కగా విద్యార్థులు నేర్చుకోవాలని పలువురు వక్తలు అన్నారు వారు మాట్లాడారు
జానపద నృత్యాలు పల్లె పరువాలను నింపుతాయన్నారు. పల్లవి, రాగం, తాళం, లయ బద్ధంగా నర్తించే నృత్యాలు మనసును ఆనందపరుస్తాయన్నారు. వెన్నెల డ్యాన్స్ అకాడమీ ద్వారా ప్రతి సంవత్సరం వేసవిలో విద్యార్థులకు కొత్త పంథాలో ఎప్పటికప్పుడు వినూత్నమైన సమాజమును చైతన్యపరిచే విధంగా శాస్త్రీయ, జానపద, వివిధ నృత్యాలను విద్యార్థులకు నేర్పించుచున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణంరాజ దేవరకోట చైర్మన్ ఆమేడ శ్రీనివాస్, ఇరువకుల ధనరాజ్ అనిల్ సాయి కృష్ణ తదితరు ఉన్నారు.






