12 July, 2026 | 2:41 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు ముందడుగు

19-02-2026 01:07 AM

ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్

ఆదిలాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ కోసం మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయిందని, ఎన్నికల సమయంలో కుట్ర లు, కుతంత్రాలు చేసినట్లు జిల్లా అభివృద్ధిలో విభేదాలు లేకుండా అన్ని రాజకీయ పక్షాలు కలిసి అభివృద్ధికి సహకరించాలని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. 

బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎయిర్ పోర్టుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేశారు. ఎయిర్ పోర్టుకు అనుసంధానంగా ఆదిలాబాద్ జిల్లాలో మరో 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ అభివృద్ధికి రాజకీయ పక్షాలు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.