25 April, 2026 | 4:01 AM

ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలి

25-04-2026 02:09 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల ఎన్టీఆర్ స్టేడియం నుండి వివేకానంద సెంటర్ వరకుశాంతి ర్యాలీగా చేరుకొని నర్సంపేట డిపోలో ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ డ్రైవర్ మృతికి సంతాపంగా మానవహారం నిర్వహించారు. అక్కడి నుండి డిపో ప్రధాన గేటు వద్ద శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించి మౌనం పాటించారు.

అనంతరం సమ్మె  కొనసాగింపులో భాగంగా ఆర్టీసీ మేనేజ్మెంట్ ,ప్రభుత్వం సమస్యల పరిష్కారం కొరకు చొరవ చూపకుండా మూడు రోజులు అయినప్పటికీ సమస్యల పరిష్కారానికి ముందుకు రాకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం తగదని వెంటనే కార్మిక సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉదృతం చేస్తామని సమ్మెకు సంఘీభావంగా వచ్చినటువంటి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, సిపిఎం నాయకులు సాధుల శ్రీనివాస్,  రాజమౌళి, సిపిఐ నాయకులు అజయ్ సారథి, విజయ్ సారధి, నవీన్, టీ జాక్ నాయకులు డాక్టర్ డోలి సత్యనారాయణ, మైసా శ్రీనివాస్, బీజేపీ, వివిధ కార్మిక సంఘాల నాయకులు లింగన్న, ఐలన్న పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ కార్మిక నాయకులు  మల్లయ్య, నాగయ్య,చంద్య నాయక్, వెంకటేశ్వర్లు, ఎం .ఆర్ రెడ్డి, పట్టాభి లక్ష్మయ్య, షబ్బీర్, నభి , ఖలీల్, బిక్షపతి, లింగస్వామి, అశోక్ కుమార్, విజిత,  రాములు, సుమ, సైదులు, సుధాకర్, మంగు, విమల, జ్యోతి, రఫిక్ భాష, ఉమ, జ్యోతి రాణి, చిర్రా వెంకటేశ్వర్లు, భూక్యా రమేష్, సమ్మయ్య, రెహమాన్, దేవరాజు, రిటైర్డ్ ఉద్యోగులు, అద్దె బస్సు డ్రైవర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

భూపాలపల్లిలో..

ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి లో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నడవలేదు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఎస్పీ కే సాగర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందించాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ జాగృతి భూపాలపల్లి జిల్లా జనరల్ సెక్రెటరీ నరేష్ నేత సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఆర్టీసీ డిపో ఎదుట శంకర్ గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య  ప్రభుత్వ హత్యగా పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకి  ప్రభుత్వం ముందుగానే వారి సమస్యలను తెలుసుకొని రాష్ట్ర జే ఏ సీ కమిటీ సభ్యులతో చర్చలు జరిపి ఉంటే వాటిని న్యాయబద్ధంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తే  శంకర్ గౌడ్ మరణించేవాడు కాదన్నారు.