8 August, 2026 | 1:55 PM

ఏకాంత పరిచయం

20-07-2026 12:00 AM

ఏకాంతం.. నిన్ను నువ్వు గెలుచుకునే రణక్షేత్రం!

నిన్ను నీవు కొత్తగా ఆవిష్కరించే ఒక యజ్ఞం

ఎవరి కోసమో వెతకడం ఆపేసి

నీ కోసం నువ్వు వెతుక్కునే ప్రయాణం

“ఏకాంత వేళ నీ అన్వేషణ”

పరాయి గొంతుల మధ్య నీ మాట మరుగైన వేళ

నీ అంతరాత్మ పలికే నిశ్శబ్ద భాష - ఏకాంతం

అలల తాకిడి లేని నిశ్చల సరస్సులా

నీ ఆలోచనల ప్రతిబింబాన్ని చూసుకో

ముసుగులు లేని నీ అసలు రూపంతో

ముచ్చటగా కాసేపు ముచ్చటించుకో !

బయట వెతికితే దొరికేది కేవలం బంధం

లోపల వెతికితే దొరికేది పరమార్థం

ప్రశ్నల సుడిగుండంలో చిక్కుకున్న ప్రాణానికి

మౌనమే ఇచ్చే ఒక గొప్ప సమాధానం

లోకం నిన్ను ఒంటరిని చేసింది అనుకోకు

నిన్ను నీకు పరిచయం చేసేందుకు

కాలం ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఇది

ఈ ఏకాంత వేళ నీ అన్వేషణ

నీ విజయానికి తొలి అడుగు !!

 తరిగొప్పుల వీఎల్‌ఎన్ మూర్తి