బూందిలో బల్లి
01-07-2026 01:06 AM
సిరిసిల్ల బాలాజీ స్వీట్ హౌస్‌లో ఘటన
తంగళ్లపల్లి, జూన్ 30 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బాలాజీ స్వీట్ హౌస్‌లో కొన్ని ఆహార పదార్థాల్లో చనిపోయిన బల్లి కనిపించింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన చందు బాలాజీ స్వీట్ హౌస్‌లో బోంది కారా, రింగ్స్, గాటు వంటి స్నాక్స్ కొన్నాడు. ఇంటికి వెళ్లి చూడగా బోంది కారాలో చనిపోయిన బల్లి కనిపించింది.
దుకాణానికి వెళ్లి ప్రశ్నించగా క్షమాపణ చెప్పాల్సింది పోయి.. ‘ఇంకో కిలో ఎక్కువ తీసుకోపో‘ అంటూ బాధ్యతారాహిత్యంగా, దురుసుగా ప్రవర్తించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా? లేక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా? అంటూ బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.






