పింఛన్ కోసం 9 కి.మీ నడక
90 ఏళ్ల అత్తను బ్యాంకుకు మోసుకెళ్లిన కోడలు
ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసిన హృదయ విదారక ఘటన
రాయ్‌పూర్, మే ౨౪: ఛత్తీస్‌గఢ్‌లోని సర్గూజా జిల్లా మైన్‌పట్ అట వీ ప్రాంతంలో హృదయ విదారక ఘటనచోటుచేసుకుంది. ౯౦ ఏళ్ల అత్త పింఛన్ పొందేందుకు ఓ మ హిళ ఆమెను మోసుకుంటూ ౯ కి.మీ నడిచివెళ్లింది. అందుకు సం బంధిచిన వీడియో ను ఓ గుర్తుతెలియని వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది.
ఒకవైపు కృత్రిమమేధ, అత్యాధునిక సాంకేతిక విప్లవం దిశగా ప్రపంచం పయనిస్తున్న వేళ, మరోవైపు ఒక మహిళ పింఛను కోసం మరో మనిషిని ఎత్తుకుని నడుచుకుంటూ పింఛన్ ఆఫీసుకు వెళ్లడం విస్మయానికి గురిచేస్తున్నది. మైన్‌పట్‌కు చెందిన సుఖ్మనియా బాయి అనే మహిళ తన 90 ఏళ్ల వృద్ధురాలు. పింఛను లబ్ధిదారు. కేవైసీ పూర్తి చే యని కారణంగా ఆమెకు నాలుగు నెలల నుంచి పింఛను అందడం లేదు. నెలకు ౫౦౦ చొప్పున ఆమెకు రూ.౨ వేలు అందా ల్సి ఉన్నది. నిబంధనల ప్రకారం కేవైసీ కోసం లబ్ధిదారులే స్వయంగా బ్యాంకుకు వెళ్లి వేలిముద్ర వేయాలి.
అప్పుడే బ్యాంకర్లు పింఛను విడుదలచేస్తారు. సుఖ్మనియా ఇప్పటికే వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్నది. ఆమె సొంతంగా ప్రయాణించి బ్యాం కుకు వెళ్లి పింఛను సొమ్ము తీసుకోలేదు. దట్టమైన అటవీప్రాంతం కావడం, వాగులు వంకలు దాటాల్సి రావడంతో అక్కడ రవా ణా సైతం అంతంతమాత్రమే. దీంతో సుఖ్మనియాను మోసుకుంటూ కోడలు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ బైకర్ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌చే శాడు. కేవలం రూ.౨ వేల పింఛను కోసం ఓ మహిళ తన అత్తను మోసుకు వెళ్లాల్సిన దైన్యంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వాలు పింఛన్‌ను వృద్ధులకు ఇంటివద్దనే ఎందుకు అప్పగించడం లేదని నిలదీస్తున్నారు.






