తెలంగాణకు కేంద్రం కానుక
- అన్ని హంగులతో హైటెక్ సిటీ రైల్వేస్టేషన్
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- ప్రధాని చేతుల మీదుగా వర్చువల్ ప్రారంభోత్సవంపై హర్షం
శేరిలింగంపల్లి, జూలై 17 (విజయక్రాంతి): అమృత్ భారత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.26 కోట్లతో హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ నిర్మించిందని, తద్వారా తెలంగాణకు చక్కటి కానుక ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ శుక్రవారం దేశవ్యాప్తంగా ౭౫ రైల్వేస్టేషనన్లను వర్చువల్‌గా ప్రారంభించగా, వాటిలో హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ కూడా ఉంది.
ఈ కార్యక్రమానికి రాంచందర్‌రావు హాజరై మాట్లాడారు. ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌కు హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ ఒక కీర్తి కిరీటమని అభివర్ణించారు. స్టేషన్ ద్వారా ప్రతిరోజూ వేలాది మంది ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందుతాయని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం అత్యాధునిక వెయిటింగ్ హాల్స్, పార్కింగ్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.






