18 July, 2026 | 12:58 AM

శ్రీనివాసపురంలో వైద్యసేవలు ప్రారంభం

18-07-2026 12:56 AM

ఆలేరు, జూలై 17 : మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో గ్రామ ప్రజలకు వైద్య సేవలను శుక్రవారం ప్రారంభించారు. వారంలో రెండు రోజులు బీపీ, షుగర్, జ్వరం తదితర ఓపీ సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వడ్ల శోభన్ బాబు మాట్లాడుతూ ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్ దూరంలో ఉండటంతో గ్రామంలోనే వైద్య సేవలు అందడం సంతోషంగా ఉందన్నారు.

గ్రామంలో పీహెచ్సీ భవన నిర్మాణం పూర్తయినా ఎంఎల్హెచ్పీ డాక్టర్ పోస్టు, ఆశా వర్కర్ పోస్టు మంజూరు కాలేదని, వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను గతంలోనే కోరామని ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయి వైద్య సేవలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం ఇస్తారి, వైద్యాధికారి హైమావతి, హెల్త్ సూపర్ వైజర్ మరియమ్మ, బిస్మిల్లా, పీహెచ్‌ఎన్ సరిత, ఎంఎల్హెచ్పీ రత్న బాయి, ఏఎన్‌ఎంలు ప్రమీల, మాధవి, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శి భవాని, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.