వంటింటిపై గ్యాస్‘బండ’!
- మరోసారి పెరిగిన గ్యాస్ ధర
- విలవిల్లాడుతున్న సామాన్యుడు
కరీంనగర్, జూన్ 7 (విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 10.80 లక్షలకు పైగా గృహ వంట గ్యాస్ కనెక్షన్లు, 2.62 లక్షలకు పైగా వాణిజ్య (కమర్షియల్) కనెక్షన్లు ఉన్నాయి. సామాన్యులకు షాక్ ఇస్తూ దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. గృహ వినియోగ (14.2 కేజీలు) సిలిండ్ప రూ.29 మరియు కమర్షియల్ సిలిండ్ప సుమారు రూ.42 నుండి రూ.53 వరకు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్ల సవరించిన ఈ కొత్త ధరలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జ్పె తీవ్ర భారం పడింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మరియు పశ్చిమాసియాలో యుద్ధాల నేపథ్యంలో ధరలు పెరిగినట్లు సంస్థలు పేర్కొన్నాయి. కరీంనగర్లో రూ. 984 నుండి రూ. 994 వరకు పలుకుతోంది (ప్రాంతం మరియు సంస్థను బట్టి మారుతుంది). తాజాగా పెరిగిన29 రూపాయలతో వెయ్యి దాటింది. ఉమ్మడి జిల్లా ప్రజలపై ప్రతి నెల 3 కోట్ల రూపాయల అదనపు భారం పడింది.
మూడు నెలల వ్యవధిలోనే సిలిండ్ప రూ. 89 వరకు భారం పడింది. ఉమ్మడి జిల్లాలో ఇండేన్ , భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వంటి కంపెనీలు సేవలను అందిస్తున్నాయి. గ్యాస్ సరఫరా సమయంలో పెరిగిన ధర పోను సర్వీస్ బాదుడు పెరగనున్నాయి.
ఒక్కో సిలెండర్ 1050 వరకు సమర్పించుకోవలసి వస్తుందని వినియోగదారుడు వాపోతున్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వామపక్ష పార్టీ లు, కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీ లు ఆందోళనకు సిద్దం అవుతున్నాయి.






