బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్
23-03-2026 05:09 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్ల నారాయణ తల్లిగారు గత కొన్ని రోజుల క్రితం మరణించడంతో వారి కుటుంబాన్ని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ సంకు లక్ష్మయ్య, డిసిసి ప్రధాన కార్యదర్శి మంద బలరాం, నాయకులు ప్రజాపండరి, బంగ్లా ప్రవీణ్, దిడ్డి రాజు, మంగలి ఎల్లయ్య, చాకలి సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.




