28 May, 2026 | 1:34 AM

మహిళలకు 33 శాతం సీట్లు

28-05-2026 01:05 AM
  1. బిల్లు పాసైనా, అవ్వకపోయినా రిజర్వేషన్లు కల్పిస్తాం
  2. వైకాపా వేధింపులతోనే ఓ కుటుంబం ఆత్మహత్య
  3. మహానాడులో నారా లోకేశ్ 

అమరావతి, మే 27: టీడీపీలో ఇకపై మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. పార్లమెంట్‌లో బిల్లు పాసైనా, అవ్వక పోయినా పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో మహిళళకు 33 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. బుధవారం మహానాడు లో లోకేశ్ మాట్లాడారు. టీడీపీ సిద్ధాంతాలే మనకు బలమన్నారు. రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే అది సీఎం చం ద్రబాబునాయుడు కృషి వల్లే అన్నారు.

సమాజం లో కొంతమంది మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మార్పు మన ఇంటినుంచే మొద లు కావాలని, మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉం దని నారా లోకేశ్ పేర్కొన్నా రు. సంక్షేమం, అభివృద్ధిపై ప్రతిపక్షాలు చర్చకు సిద్ధంగా ఉన్నా యా? తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వైకాపా వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందన్నారు. ఎంతోమంది బీసీ, ఎస్టీ, మైనార్టీ సోదరులను చంపేశారన్నారు. వేధించొద్దన్న అమర్‌నాథ్ గౌడ్‌ను ఏకంగా కిరోసిన్ పోసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారన్నారు. 

గొడ్డలి పార్టీ అంటే వైకాపాకు కోపం వచ్చిందన్నారు. మాది గూగుల్, మీది గొడ్డలి అని మాది ఫైటర్ జెట్, మీది ఫ్యాక్షన్, మాది కియా అది, మీది కిడ్నాప్ అని నారా లోకేశ్ విమర్శించారు.