ఎస్పీని కలిసిన సోషల్ జస్టిస్ ఫోరం నాయకులు

25-09-2026 | 06:54pm

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(Jayashankar Bhupalpally District SP Sirishetti Sankeerth) ను సోషల్ జస్టిస్ ఫోరం(Social Justice Forum) జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో నిరుద్యోగ యువతకు(Unemployed youth) ఎస్పీ ఆధ్వర్యంలో 75 రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులు(Free training classes) నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఏషబోయిన సాంబయ్య యాదవ్, జిల్లా కన్వీనర్ పెరబోయిన రాజన్న పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు