భద్రాచలంలో ఘనంగా వినాయక నిమజ్జనాలు
భద్రాచలం (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) భద్రాచలం పవిత్ర గోదావరి నది(Godavari River) తీరంలో ఘనంగా వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతున్నది. పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేయాలని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతోపాటు చత్తీస్గడ్ ఒరిస్సా(Chhattisgarh Odisha) ప్రజలు పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలను భద్రాచలం తీసుకుని రావడంతో గోదావరి నది తీరం కరకట్ట ప్రాంతాలు గణేష్ విగ్రహాలతో నిండిపోయాయి. దీంతో గణేష్ విగ్రహాల నిమజ్జనం(Immersion of Ganesh idols) తీవ్రజ్జాప్యం జరుగుతున్నది.
జిల్లా అధికార యంత్రాంగం గణేష్ విగ్రహాల నిమజ్జనం నకు క్రేన్లు లాంచీలను ఏర్పాటు చేసినప్పటికీ, భారీ సంఖ్యలో విగ్రహాలు రావడంతో ఆలస్యం అవుతున్నది. మూడు షిఫ్ట్ లుగా విభజించి నిమజ్జనం చేసే కార్యక్రమం చేపడుతున్నారు. నిమజ్జన సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నివారించడానికి గజ ఈతగాలను, పోలీసులను అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చే గణేష్ విగ్రహాల వాహనాలను నియంత్రించి నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit), జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, డి.ఎస్.పి అరుణ్ కుమార్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వేలాది గణేష్ విగ్రహాలు భద్రాచలం చేరుకోగా, శని ఆదివారాల్లో సైతం కొనసాగే అవకాశం ఉంటుంది.