జీఎం ( సీపి, పీ ) మనోహర్ సేవలు చిరస్మరణీయం
- జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి
- పదవీ విరమణ సందర్భంగా మనోహర్ ను ఘనంగా సత్కరించిన జీఎం దంపతులు
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 25 ( విజయ క్రాంతి ) : జీఎం ( సీపి, పీ ) ఏ మనోహర్(A. Manohar, GM (CP&P)) సింగరేణి సంస్థకు(Singareni Company) అందించిన సేవలు చిరస్మరణీయమని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి(GM Enugu Rajeshwar Reddy) అన్నారు. సింగరేణి సంస్థలో 38 సంవత్సరాల పాటు సేవలందించి ఈనెల పదవీ విరమణ పొందుతున్న జీఎం సీపీ,పి ఏ మనోహర్ దంపతులకు ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, సేవ అద్యక్షురాలు శ్రీమతి సునీత రాజేశ్వర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జీఎం రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5, కేఎల్పీ భూగర్భ గనుల ఏజెంట్గా పనిచేసిన సమయంలో సురక్షిత బొగ్గు ఉత్పత్తికి చర్యలు చేపట్టడంలో కీలక పాత్ర మనోహర్ పోషించారని, విధుల పట్ల ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, కార్యదక్షత అందరికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సేవ ఎస్ఓ టు జీఎం రామన్ వి పాఠక్, ఐఈడి ఏజీఎం జోతి , ఓసీపీ 2 పీఒ శ్యామ్ సుందర్, ఓసీపీ 3 పీఒ రామస్వామి, ఏరియా కేటీకె 1 గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, ఏఎస్ఒ మాటూరి రవీందర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, అన్ని గనుల, డిపార్ట్మెంట్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.