జూరాల నీటి కోసం బీజేపీ పోరాటం ఫలించింది

25-09-2026 | 07:40pm

పెద్దిరాజు

వనపర్తి మండలం సెప్టెంబర్ 25 : జూరాల ప్రాజెక్టు(Jurala Project) నుంచి సాగునీరు విడుదల(Release of irrigation water) చేయాలని బీజేపీ చేపట్టిన ఉద్యమం ఫలితంగానే ప్రభుత్వం స్పందించిందని జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు(District General Secretary Peddiraju) అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేశ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రైతులకు సాగునీరు అందించాలని బీజేపీ జూరాల వద్ద ధర్నా, ప్రాజెక్టు ముట్టడి చేపట్టిందన్నారు.

ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి, కర్ణాటకకు ప్రతినిధి బృందాన్ని పంపిందని తెలిపారు. రైతుల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.సమావేశంలో రవి నాయక్, తిరుపతి నాయక్, రెడ్యా నాయక్, వసిరామ్ నాయక్, తిరుపతయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు